జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969):
భారత 3వ రాష్ట్రపతి మే 13 1967 నుండి మరణించినంతవరకు మే 3, 1969.
హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ నుండి హైదరాబాదుకు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా హైస్కూల్' నందు చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజి లో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.
హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిలియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేయుటకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయం' నకు ( జర్మనీ ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిలియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీ తో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమదార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నాహ్ చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారతస్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉపాధ్యక్ష పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.
(ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ).
ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
ఇతడిని 1963 లో భారతరత్న బిరుదుతో గౌరవించారు.
వరాహగిరి వేంకటగిరి మే 3, 1969 జూలై 20, 1969
మహమ్మద్ హిదయతుల్లా:
మహమ్మద్ హిదయతుల్లా (డిసెంబర్ 17, 1905 - సెప్టెంబర్ 18, 1992) ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి వి.వి.గిరి చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి 1992 సంవత్సరంలో మరణించాడు.
అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము మరియు విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగష్టు 31 నుండి 1984, ఆగష్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
పదవులు
1956 నుండి 1958 వరకూ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు.
25.12.1968 న భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు.

No comments:
Post a Comment