Thursday, 2 April 2015

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్( ఆగష్టు 24, 1974నుండి ఫిబ్రవరి 11, 1977):

ఫక్రుద్దీన్ అలీ అహమద్ (13 మే 1905 – 11 ఫిబ్రవరి 1977)భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీ లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

బి.డి.జట్టి ఫిబ్రవరి (11, 1977నుండి జూలై 25, 1977):

బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు.

బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.

బసప్ప నిర్వహించిన పదవులు:

ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
1972 నుండి 1974 ప్రాంతములో ఒరిస్సా గవర్నరుగా ఉన్నాడు.

No comments:

Post a Comment