Sunday, 26 April 2015

భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్దతులు :


  • భారత రాజ్యాంగంలో దేశపౌరసత్వాన్ని పొందే పద్ధతులను గురించి లేదా పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులను గురించి ఏలాంటి విశ్లేషణాపూర్వక నిబంధనలు పేర్కోనలేదు.
  • భారత పార్లమెంటు రూపోందించే చట్టాలనూసరించి మన దేశ పౌరసత్వాన్ని పోందే పద్ధతులు కోల్వోయో పద్ధతులు నిర్ణయించబడతాయి.
  • భారత పౌరసత్వ చట్టాన్ని 1955లో మొదటిసారిగా రూపొందించారు 
  • భారత పౌరసత్వచట్టాన్ని-1955లో కోన్ని సవరణలను పార్లమెంటు చేసినది 
                 * 1986 లో మొదటిసారిగా
                 * 1992,2003,2004,2005 లో కూడా సవరణలు చేశారు
  • భారత పౌరసత్వచట్టాన్ననుసరించే మన దేశంలో 5 పద్ధతులదార్వా పౌరసత్వంను పొందవచ్చు
   (1) జస్‌స్సోలి : 
  • జన్మించిన స్థలం ఆధారంగా పౌరసత్వంను పొందండ "జంస్సోలి"
  • జనవరి 26,1950 తర్వాత మనదేశంలో జన్మించిన వారందరికీ దేశ పౌరసత్వం లభిస్తుంది
  • విదేశీయులకు,రాయాబారాలకు,దౌత్యవేత్తలకు,ప్రైవేటు పనులపై మన దేశమును సందర్మించేవారికి ఈ నిబందన వర్తంచదు 
   (2) జస్ సాంగ్వినాస్ :
  •  రక్త సంబంధం ద్వార పౌరసత్వం పొందే పద్ధతి "జస్ సాంగ్వినాస్" 
  •  భారతీయ తల్లిదండ్రులకు విదేశాల్లో సంతానం కలిగినప్పటికీ వారి తల్లిదండ్రుల ద్వారా మనదేశ పౌరసత్వాన్ని ఈ పద్ధతిద్వారా పొందవచ్చును 

   (3) నమోదుద్వారా :

  •  భారతీయులను వివాహామండిన విదేశీయులు కూడా మనదేశ పౌరసత్వంను పొందవచ్చును
  • మనదేశీయులను వివాహామాడినవారు ఈ దేశ పౌరసత్వం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి 
  • ప్రస్తుతం ఈ పద్ధతిద్వారా పౌరసత్వం పొందాలంటే 5 సం"లు స్థిరనివాసులై ఉంటూ తమపేర్లను నమోదు చేసుకొని 12నెలల తర్వాత నిబంధలను పాటించినదీ లేనిదీ పరిశీలించిన 6 నెలల తర్వాత వారికి పౌరసత్వం లభిస్తుంది 
       (1992 లో ఈ చట్టంలో సవరణను అనుసరించి భారతీయ పురుషులను మాత్రమే కాకూండా స్త్రీలను వీవాహామాడిన వారికి కూడా దేశ పౌరసత్వం కల్పించవచ్చు)
  •      ఈ పద్ధతి ద్వారా పౌరసత్వం పొందినవారికి ఉదాహారణ- శ్రీమతీ సోనియగాంధీ 

    (4) సహాజీక్నత పౌరసత్వం :

  •  సహాజసిద్ధంగా లభించిన తమ మాతృదేశ పౌరసత్వాన్ని వధులుకొని మనదేశ పౌరసత్వాన్ని స్వీకరించాలాలని కోరుకునే విదేశీయులకు కల్పించే పౌరసత్వమే "సహాజీకృత పౌరసత్వం "
  •  గతంలో ఈ పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని పొందాలంటే కనిసం 5సం;లు స్థీరనివాసులై ఉండాలి 
  •  1986 చట్టసవరణనను సరించి కనిసం 10సం;లు స్థిరనివాసులై ఉండాలి.అదే విధంగా గుర్తింపు పొందిన భారతియ భాషాలలో ఏదైనా ఒక భాషపై అవగాహాన ఉండాలి ఈ పద్ధతిద్వారా దేశ పౌరసత్వం పొందినవారు-(మథర్ థెరిస్సా) 

    (5) భూభాగాల విలీనంద్వారా:

  •  ఏదైనా ఇతరప్రాంతాలు అనగా భూభాగాలు మనదేశంలో వీలీనం చెందినపుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించవచ్చు 

         ఉదా; 1975 లో సిక్కిం భారత్ లో విలినమవటం 

 పౌరసత్వం _కోల్వోయే పద్ధతులు ;  

      (1) పరిత్యాగము : ఏ భారతీయుడైననూ విదేశీ పౌరసత్వాన్ని పొందాలనే కోరికతో తనకు తాను స్వచ్చందంగా మనదేశ పౌరసత్వాన్ని వదులుకోవడమే "పరిత్యాగము"
      (2) అంతమగుట : ఏ వ్యక్తీ అయిననూ విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించనప్పుడు సహాజసిద్ధంగానే మనదేశ పౌరసత్వాన్ని కోల్వోతాడు.విదానమే "అంతమగుట"
      (3) అంతమొందించుట : ప్రభుత్వం భారత పౌరసత్వ చట్టాలననుసరించి కోన్ని సందర్భాలలో కొందరి పౌరసత్వాన్ని రద్ధుచేస్తుంది
                      ఉదా: దేశద్రోహాన్ని పొల్పడినపుడు,భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినపుడు ఇతరులు అనగా మనదేశ పౌరసత్వం స్వీకరించినవారు నియమ నిబందనలను ఉల్లంఘించినపుడు వారి పౌరసత్వాన్ని రద్ధుచేయటమే :అంతమొందించుట"

No comments:

Post a Comment